అపురూపమైనదమ్మా ఆడ జన్మ
కార్యేషు దాసీ
కరణేషు మంత్రి
భోజ్యేషు మాతా
శయనేషు రంభ
అపురూపమైనదమ్మా ఆడ జన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
అపురూపమైనదమ్మా ఆడ జన్మా
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
మగవాని బ్రతుకులో
సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా
అపురూపమైనదమ్మా ఆడ జన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
పసుపు తాడు ఒకటే మహా భాగ్యమై
బ్రతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచి కోసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరె ఆప్తులు
ఏ పూజ చేసినా ఏ నోము నోచినా
ఏ స్వార్ధమూ లేని త్యాగం
భార్యగా రూపమే పొందగా
అపురూపమైనదమ్మా ఆడ జన్మా
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
అపురూపమైనదమ్మా ఆడ జన్మా
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
కలిమి లేములన్ని ఒకే తీరుగా
కలిసి పంచుకోగా సదా తోడుగా
కలిసి రాని కాలం వేలే వేసినా
విడిచి పోని బంధం తనై ఉండదా
సహ ధర్మ చారిణి
సరి లేని వరమనీ
సత్యాన్ని కనలేని నాడు
మోడుగా మిగలడా పురుషుడూ
అపురూపమైనదమ్మా ఆడ జన్మా
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
అపురూపమైనదమ్మా ఆడ జన్మా
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
మగవాని బ్రతుకులో
సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా
కార్యేషు దాసీ
కరణేషు మంత్రీ
భోజ్యేషు మాతా
శయనేషు రంభా
Comments
Post a Comment